Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 600 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో..

Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
Bank Of Maharashtra Apprentice Notification

Updated on: Jan 17, 2026 | 10:24 AM

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 600 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 17 వరకు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికూన వారికి నెలకు రూ.12,300 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.