AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. దరఖాస్తులు ఓపెన్

బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు వేతనం లభిస్తుంది..

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. దరఖాస్తులు ఓపెన్
Bank Of Baroda Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 07, 2026 | 1:45 PM

Share

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II) 100 పోస్టులు వరకు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేషన్ కూడా ఉండాలి. అదనంగా వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఇక క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా డిప్లొమా, లేదా MBA (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాంకింగ్) అర్హత ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. CA అర్హత ఉన్న అభ్యర్థులకు, ముఖ్యంగా కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 సెప్టెంబరు 1 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబరు 24, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, EWS, OBC అభ్యర్థులు రూ.850 + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175 + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి. ఫీజులో GST కూడా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం అర్హత సాధించిన వారికి ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్ లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు. వీటికి అదనంగా నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి