అస్సాం రైఫిల్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఉన్న ఈ సంస్థలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రైఫిల్‌మ్యాన్ జనరల్ డ్యూటీ (జీడీ) (81), హవల్దార్ క్లర్క్ (01), వారెంట్ ఆఫీసర్ ఆర్‌ఎం (01), వారెంట్ ఆఫీసర్ డ్రాఫ్ట్స్‌మెన్ (01), రైఫిల్‌మ్యాన్ ఆర్మరర్ (01), రైఫిల్‌మ్యాన్ ఎన్‌ఏ (01), రైఫిల్‌మ్యాన్ బీబీ (02), రైఫిల్‌మ్యాన్ కార్ప్ (01), రైఫిల్‌మ్యాన్ కుక్ (04), రైఫిల్‌మ్యాన్ సఫాయ్ (01), రైఫిల్‌మ్యాన్ డబ్ల్యూఎం (01) ఖాళీలు ఉన్నాయి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డైరెక్టరేట్ జనరల్, అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్, మేఘాలయ చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 22-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* రిక్రూట్‌మెంట్ ర్యాలీని 11-02-2023 తేదీన నిర్వహించనున్నారు.
* హెడ్‌క్వార్టర్స్, డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్, మేఘాలయ అడ్రస్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..