Job Mela: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రేపు భారీ జాబ్‌ మేళా.. 300 ఖాళీలు..

|

Jul 05, 2022 | 5:54 PM

Job Mela: ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా..

Job Mela: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రేపు భారీ జాబ్‌ మేళా.. 300 ఖాళీలు..
Follow us on

Job Mela: ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా డెక్కన్‌ కెమికల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* జాబ్‌ మేళాలో భాగంగా ప్రాసెస్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ట్రెయినీ కెమిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్‌సీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి రూ.19,477 జీతంగా అందిస్తారు.

* ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-27 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.21,165 వేతనం చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టరేషన్ చేసుకోవాలి.

* అభ్యర్థులను టెక్నికల్ రౌండ్, హెఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను నెహ్రూ యువ కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, బాలాగా రోడ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చిరునామాలో 06-07-2022 తేదీన నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం 6301045132, 8317652552 నెంబర్లను సంప్రదించాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..