APPSC Exam dates 2022: ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు విడుదల..ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష తేదీలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో (AP Endowments Sub-Service Department) మొత్తం 730 పోస్టులకు నోటీఫికేషన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు విడుదలయ్యాయి..

APPSC Exam dates 2022: ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు విడుదల..ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష తేదీలు ఇవే..
Appsc

Updated on: May 31, 2022 | 9:51 PM

APPSC Screening test dates 2022: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో (AP Endowments Sub-Service Department) మొత్తం 730 పోస్టులకు నోటీఫికేషన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3 పోస్టులు, 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. ఐతే ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్లలో పేర్కొనలేదు. మంగళవారం (మే 31) వీటికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జులై 24 తేదీన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులకు, జులై 31న రెవెన్యూ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు అభ్యర్ధులకు సూచించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.