మహిళలకు APPSC గుడ్‌న్యూస్.. శిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు! అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీ శుభవార్త తెలిపింది. ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో సూపర్‌వైజర్ గ్రేడ్ 1 (మహిళలకు మాత్రమే) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీ శుభవార్త తెలిపింది. ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో సూపర్‌వైజర్ గ్రేడ్ 1 (మహిళలకు మాత్రమే) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అక్టోబరు 16, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, బోటనీ, జూలజీ, కెమిస్ట్రీ లేదా బయో-కెమిస్ట్రీ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర అర్హతలు, నిబంధనలను కూడా తప్పనిసరిగా అనుసరించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 5న రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సూపర్‌వైజర్ గ్రేడ్ 1 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు నిర్వహిస్తారు. ఇది రెండు పేపర్లకు ఉంటుంది. రెండో దశలో కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటుంది. ఈ రెండు దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం తుది ఎంపికకు పరిగణిస్తారు.
ముఖ్యమైన వివరాలు..
- పోస్టులు: సూపర్‌వైజర్ గ్రేడ్-I (మహిళలకు మాత్రమే)
- మొత్తం ఖాళీలు: 29
- వేతనం: నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబరు 16, 2026వ తేదీ నుంచి
- చివరి తేదీ: నవంబరు 5, 2026వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు
ఏపీపీఎస్సీ సూపర్ వైజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




