APPSC Notifications 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ

|

Nov 02, 2023 | 6:50 AM

ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలోనే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ బుధవారం (నవంబర్‌ 1) వెల్లడించారు. మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నోటిఫికేషన్లలో గ్రూప్‌-2 పోస్టులు 900, వందకుపైగా గ్రూప్‌-1 పోస్టులు, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 267, పాలిటెక్నిక్ లెక్చరర్‌ 99 పోస్టులు, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఇక యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన..

APPSC Notifications 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ
APPSC
Follow us on

అమరావతి, నవంబర్‌ 2: ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలోనే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ బుధవారం (నవంబర్‌ 1) వెల్లడించారు. మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నోటిఫికేషన్లలో గ్రూప్‌-2 పోస్టులు 900, వందకుపైగా గ్రూప్‌-1 పోస్టులు, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 267, పాలిటెక్నిక్ లెక్చరర్‌ 99 పోస్టులు, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఇక యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో ఈ పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

గతేడాది కేవలం 11 నెలల వ్యవధిలోనే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసి, పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు ఎపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.

దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగాలకు సంబంధించి వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని, అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. గ్రూప్‌ 2కి ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయి. మరో 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడం ఆలస్యం అయ్యింది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయింంది. అన్ని పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్‌ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపారు. దీనిని వక్రీకరిస్తూ కొందరు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ మేరకు నవంబర్‌లోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.