APPSC Assistant Engineer Exam date 2022: ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు (APPSC AE Admit Card 2022) సోమవారం (మే 9) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ కమిషన్ అధికారిక వైబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రాత పరీక్ష మే 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ తెల్పింది. కాగా మొత్తం 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితాలు విడుదల ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది.
Also Read: