షెడ్యూల్ కులాలకు చెందిన నిరుపేద కుటుంబాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండి ఆర్థికంగా వెనకబడిన కుటంబాలకు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2022-23 ఏడాదికి గాను స్కాలర్ షిప్‌కోసం ఆహ్వానాలు స్వీకరిస్తోంది. అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పేరుతో ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు పై చదువుల కోసం రూ. 2500 నుంచి రూ. 13,500 వరకు ఉపకార వేతనం అందిస్తారు.
ఈ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తగరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతూ ఉండాలి. విద్యార్థుల కుటంబ ఆదాయం రూ. 2.5 లక్షలు మించకూడదు. కేవలం ఇండియాలో చదివే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌లను మొత్తం 4 గ్రూప్‌లుగా విభించారు. ఇందులో మొదటిది.. గ్రూప్ 1(డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్ కోర్సులు) దీనికి ఎంపికై వారికి ఏడాదికి డే స్కాలర్‌లకు రూ. 7000, హాస్టల్‌లో ఉండే వారికి రూ. 13,500 అందిస్తారు. గ్రూప్ 2 లో (డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రొఫెషనల్ కోర్సులు) డే స్కాలర్ విద్యార్థులకు రూ.6,500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.9,500 అందిస్తారు.
గ్రూప్ 3 విషయానికొస్తే.. గ్రూప్ 1, 2 పరిధిలో లేని గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లకు డే స్కాలర్స్‌కి రూ. 3000, హాస్టల్‌లో ఉండే వారికి నెలకు రూ. 6000 చెల్లిస్తారు. గ్రూప్ 4లో భాగంగా అన్ని పోస్టు మెట్రిక్యులేషన్, నాన్-డిగ్రీ కోర్సులు చదివే డే స్కాలర్స్‌కి రూ.2,500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.4,000 ఉపకార వేతనంగా అందిస్తారు. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులకు 10 శాతం అదనంగా అందిస్తారు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..