APOSS 10th, Inter Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024, మార్చిలో నిర్వహించనున్న పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం (మార్చి 12) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా అపోస్‌ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు..

APOSS 10th, Inter Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
APOSS 10th, Inter Hall Tickets

Updated on: Mar 12, 2024 | 3:15 PM

అమరావతి, మార్చి 12: ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024, మార్చిలో నిర్వహించనున్న పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం (మార్చి 12) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా అపోస్‌ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి, ఇంరర్మీడియట్‌ టైం టేబుల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియట్‌ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ 2024 పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం.. మార్చి 28 వరకు పరీక్షలు

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 ప్రవేశ పరీక్షలు సోమవారం (మార్చి 11) నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసుకుని అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో మార్చి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 4,62,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ 2024 వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి. వీటిల్లో సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీయూఈటీ 2024 పీజీ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us