AP Supplementary Results 2022: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. జులై 6 నుంచి 15 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఎల్లుండి (ఆగస్టు 3) విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు రానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేస్తారు.
ఫలితాలను ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జులై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఏపీలో ఈసారి టెన్త్ ఫలితాలను గ్రేడ్‌లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 6,21,799 మంది హాజరుకాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్య, ఉద్యో గ వార్తల కోసం క్లిక్ చేయండి..