AP 10th class Exams 2022: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు ఇక 6 రోజులే మిగిలున్నాయ్..

|

Jan 29, 2022 | 3:24 PM

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2022 ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చేనెల (ఫిబ్రవరి) 4వ తేదీలోపు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు...

AP 10th class Exams 2022: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు ఇక 6 రోజులే మిగిలున్నాయ్..
Exam Fee Dates
Follow us on

AP 10th class Exam Fee last date: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2022 ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చేనెల (ఫిబ్రవరి) 4వ తేదీలోపు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. నామినల్ రోల్స్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఫిబ్రవరి 4వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 16 వరకు పరీక్షల ఫీజును చెల్లించొచ్చు. ఇక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుది గడువును ఫిబ్రవరి 14 వరకు బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు పరీక్షల ఫీజు చెల్లించవ్చని తాజాగా తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు వెల్లడించింది. మే 20 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Also Read:

Singareni Jobs: సింగరేణిలో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్… త్వరలో!