AP Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీలో భారీ జాబ్‌ మేళా.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నిరోద్యోగులకు అవకాశాలు కల్పిస్తూ, ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీ స్టేట్ స్కిల్‌ డెవపల్‌మెంట్ కార్పొరేషన్‌ జామ్‌ మేళాలు నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వరుస జాబ్‌మేళాలను నిర్వహించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తాజాగా మరో భారీ..

AP Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీలో భారీ జాబ్‌ మేళా.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..
Job Mela

Updated on: Oct 29, 2022 | 6:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో నిరోద్యోగులకు అవకాశాలు కల్పిస్తూ, ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీ స్టేట్ స్కిల్‌ డెవపల్‌మెంట్ కార్పొరేషన్‌ జామ్‌ మేళాలు నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వరుస జాబ్‌మేళాలను నిర్వహించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తాజాగా మరో భారీ జాబ్‌ మేళాను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 (సోమవారం) జాబ్‌ మేళాలను నిర్వహిస్తోంది. ఈ జాబ్‌మేళాలో ఏయే కంపెనీలు పాల్గొననున్నాయి.? ఎవరు అర్హులు.? ఇంటర్వ్యూలు ఎక్కడ నిర్వహిస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* జాబ్‌మేళాలో భాగంగా హెటిరో, శ్రీ గ్రోపాల్‌ ఆటోమోటివ్‌ లిమిటెడ్‌, బ్లూ ఓషన్‌ బయోటిక్‌ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* హెటిరో సంస్థలో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి.

* శ్రీ గోపాల్‌ అటోమోటివ్‌ లిమిటెడ్‌ సంస్థలో 5 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అర్హులు.

* బ్లూ ఓషన్‌ బయోటెక్‌ సంస్థలో 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు అర్హులు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఈ లింక్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

* రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 31న కాకినాడలో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొనాలు.

* ఇంటర్వ్యూను టీటీడీసీ ట్రెయినింగ్ సెంటర్‌, విమల్‌ కూల్‌ డ్రింక్స్‌ కంపెనీ దగ్గర, శామల్‌కోట, కాకినాడ, 533400 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు రెజ్యూమే, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్, పాస్ పోర్ట్ ఫొటోలతో రావాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం 8688977277, 8247788247 నెంబర్లను సంప్రదించండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..