AP Jobs: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) శుభవార్త తెలిపింది. ప్రముఖ ప్రైవేటు కంపెనీలతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహిస్తోంది. డిసెంబర్ 18న చిత్తూరులో ఈ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* ఈ జాబ్‌మేళాలో భాగంగా కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ విభాగంలో ఉన్న 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/బీటెక్ చేసిన వారి కోసం 50 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఉద్యోగం సాధించిన వారికి ఏడాదికి రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.8 లక్షల వరకు జీతంగా చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు హిందీ తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
* ఇక ఇంటర్/డిగ్రీ, బీటెక్ చేసిన వారి కోసం 50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంపికై వారికి ఏడాదికి రూ.1.64 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. తమిళం వచ్చి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో రెజ్యూమే, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలి.
* పూర్తి వివరాల కోసం 9014707897, 7799300659 నంబర్లను సంప్రదించాలి.
* ఇంటర్వ్యూ హిమజ డిగ్రీ కాలేజ్, కళ్యాణపురం, కేఎన్ రోడ్, పుత్తురు, చిత్తూరు (జిల్లా)లో నిర్వహించనున్నారు.
@AP_Skill has Conducting Pool Campus Drive for @tech_mahindra at Himaja Degree College #Puttur @chittoorgoap
Job Location: #Hyderabad & #Chennai
Register at: https://t.co/Sflqq7kjkj pic.twitter.com/9JjuZeDAFx— AP Skill Development (@AP_Skill) December 14, 2021
బిగ్ బాస్ సీజన్ 5 కు గెస్టులుగా బాలీవుడ్ కపుల్
India Vs China: భారత సరిహద్దుల్లో చైనా దూకుడు.. బాంబర్లను మొహరించి కవ్విస్తోంది..