Andhra Pradesh: ఫ్యూచర్ రెడీ సంకల్పంలో కీలక ఘట్టం.. సింగపూర్ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ రెడీ సంకల్పం దిశగా ఏపీ ఉపాధ్యాయులు అడుగులు వేస్తున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితంకాకుండా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను అందిపుచ్చుకునేందుకు 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనలో ఉంది..

Andhra Pradesh: ఫ్యూచర్ రెడీ సంకల్పంలో కీలక ఘట్టం.. సింగపూర్ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
Best Teachers From Andhra To Visit Singapore

Edited By:

Updated on: May 04, 2026 | 8:42 PM

అమరావతి, మే 4: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ రెడీ సంకల్పం దిశగా ఏపీ ఉపాధ్యాయులు అడుగులు వేస్తున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితంకాకుండా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను అందిపుచ్చుకునేందుకు 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనలో ఉంది. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ NIEలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఇన్‌స్పైరింగ్ థింకింగ్ అనే నినాదంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ విజిట్‌ను ఏర్పాటు చేశారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు అనిశ్చిత కాలంలో విద్య సవాళ్లు క్రిటికల్ థింకింగ్, డిజిటల్ బోధనా పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు. కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో ఆలోచనలను ప్రేరేపించే ఫెసిలిటేటర్స్‌గా వీరిని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే యిషున్ సెకండరీ స్కూల్‌ను సందర్శించిన మన టీచర్లు, అక్కడి అంతర్జాతీయ ప్రమాణాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు.

​రాజకీయాలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపికైన ఈ బృందంలో 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండటం విశేషం. వీరిలో 17 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సింగపూర్ తర్వాత త్వరలోనే మరో 29 మంది ఉపాధ్యాయుల బృందం ఫిన్లాండ్‌ వెళ్లనుంది. అక్కడ నేర్చుకున్న మెళకువలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఇప్పటికే పక్కా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us