ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ (ఫేజ్-3)లో అర్హులైన అభ్యర్థుల జాబితా ఈ రోజు విడుదల చేశారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. ఐతే ఈ సీట్ల కోసం దాదాపు 4,208 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు కౌన్సెలింగ్‌లలో.. 266 (ఎన్‌సీసీ కోటాలో 40 సీట్లు, స్పోర్ట్స్ కోటాలో 20 సీట్లతో కలిపి) సీట్లు మిగిలిపోయాయి.
నాలుగు క్యాంపస్‌లకు కలిపి నవంబరు 14న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కేసీరెడ్డి తెలిపారు. ఫేజ్ 3 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో అక్టోబర్ 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.