AP Polycet 2024 Notification: ఏపీ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు

|

Feb 18, 2024 | 5:01 PM

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ - 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో..

AP Polycet 2024 Notification: ఏపీ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు
AP Polycet 2024 Notification
Follow us on

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ – 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను చూడొచ్చు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పది పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద ఓబీసీ విద్యార్ధులు రూ. 400, ఎస్సీ/ఎస్టీ విద్యార్ధులు రూ. 100 చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఏపీ పాలిసెట్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 20, 2024.
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2024.
  • పాలిసెట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2024.

మే 17న తెలంగాణ పాలిసెట్ 2024 పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోనూ పాలిటెక్నిక్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 22వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ.250, ఇతర క్యాటగిరీలకు చెందిన విద్యార్ధులు రూ.500 చొప్పున ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రూ.100 ఆలస్య సుముతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులు అనుమతిస్తారు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2024 మే 17వ తేదీన పాలిసెట్ 2024 పరీక్ష నిర్వహిస్తారు. పాలిసెట్‌ నిర్వహించిన 12 రోజుల్లోగా ఫలితాలను వెల్లడిస్తారు. 2024 మే నెలాఖరుకు పాలిసెట్ 2024 ఫలితాలు వెలువడనున్నాయి. పాలిసెట్‌ 2024కు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును ఫోన్‌ ద్వారా సంప్రదించాలి. లేదా polycet-te@telangana.govi.inకు మెయిల్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.