ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమైంది. వీటిల్లో ఎస్‌ఐ పోస్టులు 315, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు 96 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. ఓసీ/బీసీ కేటగిరికి చెందని వారు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి వారు రూ.300లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 18, 2023వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. హాల్ టికెట్లు ఫిబ్రవరి 5 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.
కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.