DME AP Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

|

Sep 10, 2023 | 6:21 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం సుమారు 250 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను..

DME AP Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ
DME AP Recruitment
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం సుమారు 250 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఓ ప్రకటనలో తెల్పింది.

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ మెయిన్స్‌ పరీక్షలు

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో 2023-24 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,053 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్, గ్రూప్‌ బి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 10, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈ రోజు ముగిసేలోగా పరీక్షలకు హాజరయ్యేవారు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐబీపీఎస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మెయిన్స్‌ కూడా అర్భత సాధిస్తే తదుపరి ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఉద్యోగాలకు సంబంధించి తుది ఎంపిక జాబితా విడుదలవుతుంది.

ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల రాత పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబ‌రు 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 19 సబ్జెక్టుల్లో 247 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలకు 49.64 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 48,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 24,073 మంది మాత్రమే హాజరైనట్లు టీఎస్పీయస్సీ ఓ ప్రకటనలో తెల్పింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాల్లో పరీక్షలు జరిగాయి. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్షలు ముగియడంతో జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నియామక రాత పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 11 రోజులపాలు 16 సబ్జెక్టుల్లో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.