అమరావతి, ఏప్రిల్ 12: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2024 ఈ రోజు (ఏప్రిల్ 12) విడుదల అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న విద్యార్ధుల నిరీక్షణకు తెరపడినట్లైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆయన ఒకేసారి విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు.. ఫస్ట్ ఇయర్‌లో అబ్బాయిలు 64 శాతం, అమ్మాయిలు 71 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో అబ్బాయిలు 75 శాతం, అమ్మాయిలు 81 శాతం ఉత్తీర్ణత పొందారు.
ఇంటర్ బోర్డ్ కంట్రోలర్ సుబ్బారావు ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. 20 రోజుల్లో ఇంటర్ పరీక్షలు వాల్యుయేషన్ పూర్తచేశామని తెలిపారు. 4 లక్షల మంది మొదటి సంవత్సరంలో పరీక్షలు రాసారు. రెండో సంవత్సరంలో 3లక్షల మంది పరీక్షలు రాసారని తెలిపారు. జనరల్లో 78 శాతం మంది పరీక్షలు పాస్ అయ్యారు. ఒకేషన్ లో 38 వేల మంది పరీక్షలు మొదటి సంవత్సరం రాయగా.. 71 శాతం ఓకేషనల్‌లో పాస్ అయినట్లు తెలిపారు.
కాగా ఈ ఏడాది 9.99 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.