అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. మొత్తం 26 జిల్లాలో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 4,99,756 మంది, సెకండ్ ఇయర్‌లో 5,02,394 మంది, ప్రైవేట్‌లో సెకండ్ ఇయర్ 76,298 మంది.. మొత్తం కలిపి 10,02,150 మంది ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి కృష్ణ జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో 81 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్‌టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌కు సంబంధించి కూడా కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఎన్‌టీఆర్ జిల్లా కూడా 87 శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో 84 శాతం ఉత్తీర్ణతతో వైజాగ్ నిలిచింది. ఇక అత్యల్పంగా ఫస్ట్ ఇయర్ ఏఎస్ఆర్ జిల్లాలో 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్‌లో చిత్తూరు 63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా ఈ సారి కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదవడంతో రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఉత్తీర్ణత పొందిన జిల్లాగా తొలిస్థానంలో నిలిచింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.