AP Police Constable Posts: కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్ష ప్రశ్నపత్రం, ఆన్సర్ ‘కీ’ రికార్డులు సమర్పించండి.. హైకోర్టు ఆదేశం

|

Nov 17, 2024 | 3:50 PM

రాష్ట్రంలో గత రెండు సంత్సరాలుగా మూలన పడిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టులో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష ఆన్సర్ కీలో కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, అందువల్లనే తాము దేహదారుఢ్య పరీక్షకు అర్హత సాధించలేదని పేర్కొంటో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు..

AP Police Constable Posts: కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్ష ప్రశ్నపత్రం, ఆన్సర్ ‘కీ’ రికార్డులు సమర్పించండి.. హైకోర్టు ఆదేశం
AP High Court
Follow us on

అమరావతి, నవంబర్‌ 15: రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టులో మరో పిటీషన్‌ దాఖలైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నపత్రం, దీని తుది ఆన్సర్‌ ‘కీ’కి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని పోలీసు నియామక బోర్డును రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తుదపరి విచారణను నవంబర్‌ 18కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ జి నరేందర్, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం (గురువారం) నవంబరు 14న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఫలితాలు కూడా వెలువడ్డాయి. వీరిలో తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికైనట్లు పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్‌ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈవెంట్స్‌ షెడ్యూల్‌ వెలువడలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలను చేపట్టాలని కూటమి సర్కార్‌ అధికారులను ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభంకానున్నాయి.

ఈ క్రమంలో పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నపత్రంలో 7 ప్రశ్నలకు సరైన సమాధానాలను బోర్డు నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులయ్యామంటూ పలువురు అభ్యర్థులు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విషయమై ధర్మాసనం ముందు అప్పీల్‌ వేయగా.. గురువారం ఈ అప్పీల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. కీపై అభ్యంతరం లేవనెత్తుతూ అధికారులకు ఇచ్చిన వినతిని తమ ముందు ఉంచాలని అప్పీలుదారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.