AP EAPCET 2024 Counselling: ‘ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం

|

Oct 28, 2024 | 8:06 AM

ఏపీలో ఇటీవల కురుసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం వల్ల.. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు AP EAPCET 2024 కౌన్సెలింగ్ లకు హాజరుకాలేకపోయారు. దీంతో నష్టపోయిన వారందరి కోసం మిగిలిపోయిన సీట్ల భర్తీకి మరోమారు కౌన్సెలింగ్ జరపాలని ఓ విద్యార్ధి తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

AP EAPCET 2024 Counselling: ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం
AP High Court
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 28: ఆంధప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీ ఈఏపీసెట్‌ నాలుగో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఓ విద్యార్ధి తల్లి హైకోర్టులో పిటిషనర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిని విచారించిన హైకోర్టు ఈ వినతిపై పది రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీఈఏపీ సెట్‌-2024 కన్వీనర్‌తోపాటు ఇతర అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి రాజశేఖరరావు ఉత్తర్వులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.

మిగిలిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి పలగర అనసూర్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీని విచారన సమయంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు కోర్టుకు వినిపించారు. ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సుమారు 25 వేల సీట్లు మిగిలిపోయాయని కోర్టుకు తెలిపారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదలు సంభవించాయని, వీటి కారణంగా పిటిషనర్‌తోపాటు పలువురు విద్యార్థులు గతంలో ఈఏపీసెట్‌ మూడు కౌన్సెలింగ్‌ ప్రక్రియలకు హాజరుకాలేకపోయారని, అందువల్లనే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. మిగిలిన సీట్లను నాలుగో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 11న ఇచ్చిన వినతిపై అధికారులు నిర్ణయం తీసుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. 4వ విడత కౌన్సెలింగ్‌ వినతిపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్‌ తరపు లాయర్‌ కోర్టును కోరారు. లాయర్‌ వాదనలతో ఏకీభవించి న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్‌ 30న సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ 2024 పరీక్షల ఫలితాలు.. ఐసీఏఐ ప్రకటన

ఐసీఏఐ సీఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్ పరీక్ష 2024 ఫలితాలు అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు ఐసీఏఐ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. కాగా సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.