AP ECET 2026 Results: మరికాసేపట్లో ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన వారు బీటెక్‌ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో నేరుగా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఏపీ ఈసెట్-2026 ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను మరికాసేపట్లో అధికారికంగా విడుదల చేయనున్నారు..

AP ECET 2026 Results: మరికాసేపట్లో ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
AP ECET Results

Updated on: May 07, 2026 | 6:52 PM

అమరావతి, మే 7: బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈసెట్‌) 2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఈసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఈసెట్‌ కన్వీనర్‌ దుర్గా ప్రసాద్‌ ప్రకటన వెలువరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈసెట్‌ పరీక్ష ఏప్రిల్‌ 23న జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షకు దాదాపు 32వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్‌ 27న ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఏప్రిల్‌ 29 వరకు కీ పై అభ్యంతరాలను స్వీకరించారు. ఈసెట్‌ ఫలితాలు విడుదలైన తర్వాత లు వెలువడిన తరువాత విద్యార్ధులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్‌ సెకండ్ ఇయర్‌లో నేరుగా ప్రవేశాలు పొందొచ్చు. ఏపీ ఈసెట్ 2026 పరీక్షను ఈ ఏడాది అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ ఈసెట్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌-2026) ఆన్‌లైన్‌ పరీక్షలు రేపటి (మే 8) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 11వ తేదీ వరకు రోజుకు మూడు సెషన్లలో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాల్లో 19,118 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హజరుకానున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్‌ సాయంత్రం 4 నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన అనుమతించమని పీజీసెట్‌ చైర్మన్‌, ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో 30 సబ్జెక్టులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us