AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈసారి ఇంజనీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ విభాగంలో 95.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
ఈఏపీసెట్ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. 3,84,000 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్షలకు మొత్తం 2,82,496 మంది హాజరుకాగా, ఇందులో ఇంజనీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సుకు 87,744 మంది రాశారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..