AP BRAGCET 2025 Results out: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్‌ చేసుకోండి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్ నుంచి ర్యాంక్‌ కార్డులను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

AP BRAGCET 2025 Results out: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్‌ చేసుకోండి
AP BRAGCET 2025 Results

Updated on: May 09, 2025 | 3:34 PM

అమరావతి, మే 9: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తరగతిలో 15,020 సీట్లకు 32,823 మంది విద్యార్ధులు దరఖాస్తు పరీక్ష రాశారు. ఇక ఇంటర్‌లో 13,680 సీట్లకు 32,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్ధులు మొదటి, మూడో ర్యాంకులు సాధించారు. అనకాపల్లికి చెందిన విద్యార్థి రెండవ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశ పరీక్షల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన విద్యార్థి మొదటి ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు సెకండ్‌, థార్డ్‌ ర్యాంకులు సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల 5వ తరగతి, ఇంటర్‌ ప్రవేశ పరీక్ష 2025ల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ సీబీటీ 2 ప్రాథమిక కీ విడుదల.. మే14వరకు అభ్యంతరాలకు గడువు

ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ సీబీటీ 2 పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ తాజాగా విడుదలైంది. కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌ షీట్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్ధులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి కీపై అభ్యంతరాలను తెలిపేందుకు మే 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. కాగా సీబీటీ 2 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మే 2, 6వ తేదీల్లో దేశ వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ సీబీటీ 2 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కేఎల్‌యూలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షురూ.. తొలిరోజు 540 సీట్ల భర్తీ

కేఎల్‌ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ మే 8 నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 540 సీట్లు భర్తీ చేసినట్లు వెల్లడించింది. కేఎల్‌యూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకు సాధించిన ఆళ్ల వెంకటసాయి అఖిల్‌కు, క్రీడల విభాగంలో జిగ్నేష్‌కు సీఎస్‌ఈ విభాగంలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలను ఇన్‌ఛార్జ్‌ వీసీ డాక్టర్‌ రాజశేఖర్‌రావు విద్యార్ధులకు అందజేశారు. మే 11 వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని, జేఈఈలో అత్యధిక పర్సంటైల్‌ పొందిన విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.