ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దాదాపు 3,350 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి వెల్లడించారు. బుధవారం (మార్చి 1) ఆయన అచ్చంపేట, మాదిపాడు జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు.
కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్ధులు, 55,000ల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.