ANGRAU Tirupati Business Manager Recruitment 2022: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన తిరుపతిలోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS Tirupati).. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల (Business Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 4
పోస్టులు: బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ. 30,000ల నుంచి రూ.1,00,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి బీకాం/బీబీఏ/బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎంటెక్/ఎమ్మెస్సీ/పీజీడీఎం కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
అడ్రస్: అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, రీజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్, తిరుపతి.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10, 2022 ఉదయం 10 గంటలకు ప్రారంభం.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.