AP Jobs: క‌డ‌ప జిల్లాలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీ.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

|

Jan 29, 2022 | 10:41 AM

AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) క‌డ‌ప జిల్లాలో ప‌లు మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఏపీ ప్ర‌భుత్వ వైద్యారోగ్య విభాగానికి చెందిన ఈ సంస్థ క‌డ‌ప‌లోని ప‌లు ఆసుప‌త్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో మెడిక‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

AP Jobs: క‌డ‌ప జిల్లాలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీ.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?
Follow us on

AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) క‌డ‌ప జిల్లాలో ప‌లు మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఏపీ ప్ర‌భుత్వ వైద్యారోగ్య విభాగానికి చెందిన ఈ సంస్థ క‌డ‌ప‌లోని ప‌లు ఆసుప‌త్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో మెడిక‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో (01), ల్యాబ్‌ టెక్నీషియన్ (01), రేడియోగ్రాఫర్ (01), థియేటర్‌ అసిస్టెంట్లు (07), ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు (02), డెంటల్‌ టెక్నీషియన్ (01), ఆడియో మెట్రీషియన్ (02), జూనియర్‌ అసిస్టెంట్ (01), ఆఫీస్‌ సబార్డినేట్ (02), ఎలక్ట్రీషియన్ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్‌, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, డీఫార్మసీ/ బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత ప‌నిలో అనుభవం, సంబంధిత బోర్డులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తులను డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, ఏపీవీవీపీ, న్యూ కలెక్టరేట్‌, కడప అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్‌, కోర్సు వెయిటేజ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 12,000 నుంచి రూ. 28,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 31-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IND VS WI: వెస్టిండీస్ జట్టులో గొడవలు.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆటగాడికి వాగ్వాదం..

Petrol Price Today: స్థిరంగా కొనసాగుతోత‌న్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. ఫిబ్ర‌వ‌రి 2 త‌ర్వాత మాత్రం..

Iphone: మాస్కు కార‌ణంగా ఫోన్ ఫేస్ అన్‌లాక్ చేయ‌లేక‌పోతున్నారా.? ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడుతూ..