AP TET 2024 Results: ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా.. కొత్త తేదీ విడుదల చేసిన విద్యాశాఖ

ఏపీ టెట్ జులై-2024 ఫలితాల ప్రకటన వాయిదా పడింది. నవంబర్ 2వ తేదీన విడుదల చేయవల్సిన టెట్ ఫలితాలు కొన్ని కారణాల రిత్య వాయిదా పడ్డాయి. ఈ మేరకు టెట్ ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది..

AP TET 2024 Results: ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా.. కొత్త తేదీ విడుదల చేసిన విద్యాశాఖ
AP TET 2024 Result Date

Updated on: Nov 03, 2024 | 6:29 AM

అమరావతి, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు నవంబర్‌ 2వ తేదీన టెట్‌ ఫలితాలు విడుదల కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రిత్య ఫలితాల ప్రకటన వాయిదా పడింది. తాజాగా దీనిపై విద్యాశాఖ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. టెట్‌ ఫలితాలను నవంబరు 4న మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో రేపు అంటే సోమవారం టెట్‌ ఫలితాల ప్రకటనకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది.

కాగా అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం అభ్యర్ధుల్లో 86.28 శాతం మంది పరీక్ష రాశారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు షిఫ్టులుగా ఈ పరీక్షలు నిర్వహించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ఆన్సర్‌ ‘కీ’ వెల్లడిలో ఆలస్యం కావడంతో ఫలితాల ప్రకటన నవంబరు 4కి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరన ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఎంబీబీఎస్‌ స్ట్రే కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్య, దంత కాలేజీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం మిగిలి పోయిన సీట్ల భర్తీకి ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. గత మూడు విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు రాని వారంతా యాజమాన్య కోటా కింద సీట్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నవంబరు 2వ తేదీతో ముగిసింది. అదే రోజు రాత్రి 9 గంటలకు సీట్ల కేటాయింపు ప్రకటించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.