AP TET 2024 Result Date: ఏపీ టెట్ 2024 ఫలితాలు ఇంకెప్పుడో..? అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు..

|

Jun 20, 2024 | 8:58 AM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్-2024) ఫలితాలు ఇంకా వెలువడలేదు. టెట్‌ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల్లోనూ అయోమయం నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ 27 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్షలు పూర్తవగా.. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదలవాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌..

AP TET 2024 Result Date: ఏపీ టెట్ 2024 ఫలితాలు ఇంకెప్పుడో..? అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు..
AP TET 2024 Result Date
Follow us on

అమరావతి, జూన్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్-2024) ఫలితాలు ఇంకా వెలువడలేదు. టెట్‌ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల్లోనూ అయోమయం నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ 27 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్షలు పూర్తవగా.. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదలవాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఫలితాల వెల్లడికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత ఎన్నికల అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ చెప్పినా.. ఇంత వరకు టెట్‌ రిజల్ట్స్‌ రాకపోవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది.

మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని సర్కార్ ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే టెట్‌ ఫలితాలు వెలువరించి, ఆ వెనువెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేస్తామని సర్కార్‌ తెలిపింది. ఇప్పటికే కార్యచరణ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ప్రభుత్వ ఉద్యోగం పొందాలనేది ఎందరో నిరుద్యోగుల చిరకాల స్వప్నం. కానీ రాష్ట్ర రాజకీయాల కారణంగా అరకొరగా ఉద్యోగ ప్రకటనలు వచ్చినా.. వాటిని సకాలంలో భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండటంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ వయసు పెరిగిపోతున్న వారు మాగతేంగాను అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టెట్‌ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు విడుదలైతేనే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టెట్‌ ఫలితాల విడుదల తేదీ, డీఎస్సీ విధివిధానాలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.