AP TET 2024 Notification Out: ఏపీ టెట్‌ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్..! కొత్త సిలబస్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ సోమవారం (జులై 1) రాత్రి విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రకటించారు. కూటమి సర్కార్ ముందుగా చెప్పినట్లు గానే మెగా డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 2వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో..

AP TET 2024 Notification Out: ఏపీ టెట్‌ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్..! కొత్త సిలబస్‌ ఇదే..
AP TET 2024

Updated on: Jul 01, 2024 | 9:09 PM

అమరావతి, జులై 1: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ సోమవారం (జులై 1) రాత్రి విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రకటించారు. కూటమి సర్కార్ ముందుగా చెప్పినట్లు గానే మెగా డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 2వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్ధులు అందులో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ టెట్ అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జులై 2న అధికారిక వెబ్‌సైట్లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంచనున్నారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత జులై 3 నుంచి జులై 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. టెట్‌ పరీక్షలను ఆగస్టులో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌ సిలబస్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 సిలబస్‌ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరోవైపు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. మొత్తం 16,347 పోస్టులతో కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us