ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు డిసెంబరు 10వ తేదీలోపు పరీక్ష రుసుము చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా డిసెంబరు 10వ తేదీలోపు విద్యార్ధులు తమ స్కూళ్లలోని ప్రధాన ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.50ల ఆలస్య రుసుముతో డిసెంబర్20 వరకు చెల్లించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. పిల్లల పరీక్ష రుసుములు, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.