AP Govt Jobs: వైద్యుల నియామక పోస్టులు భారీగా పెంపు.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 2న వైద్యుల నియామకాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 200 పోస్టులను జతచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌లో మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా 200 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 297కు పెంచుతున్నట్లు ప్రకటించింది..

AP Govt Jobs: వైద్యుల నియామక పోస్టులు భారీగా పెంపు.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
AP Govt Jobs

Updated on: Jan 23, 2025 | 10:59 AM

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ వైద్యుల నియామకం కోసం గత ఏడాది డిసెంబరు 2న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఉద్యోగాలకు అదనంగా మరో 200 పోస్టులను జతచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌లో మొత్తం 97 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా 200 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 297కు పెరిగింది.

తాజాగా జారీచేసిన ప్రకటనలో డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (డీహెచ్‌ఎస్‌)కు చెందిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ వైద్యుల పోస్టులు 200 కలిపినట్లు మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ పోస్టులన్నింటినీ రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జనవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు పంపాలని వైద్య ఆరోగ్య శాఖ తన ప్రకటనలో సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సీఎఫ్‌డబ్ల్యూ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సీఎంఏలో బీసీ గురుకుల విద్యార్థుల సత్తా.. 104 మందికి గాను 97 మంది ఉత్తీర్ణత!

ఇటీవల సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ ఎకౌంటెన్సీ(సీఎంఏ) ఫౌండేషన్‌ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకుల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలోని మొత్తం 18 బీసీ గురుకుల విద్యాలయాల నుంచి 104 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. వారిలో ఏకంగా 97 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి నెల్లూరుకు చెందిన రావూస్‌ విద్యాసంస్థలో ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ అందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.