AP SSC Results 2022: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.. ఎప్పుడు విడుదల కానున్నాయంటే..

|

Jun 04, 2022 | 11:52 AM

AP 10th Class Result 2022 postponed: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల...

AP SSC Results 2022: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.. ఎప్పుడు విడుదల కానున్నాయంటే..

AP 10th Class Result 2022 postponed: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను సోమవారం (జూన్ 6) రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎంతో ఆసక్తికగా ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.

ఇదిలా ఉంటే వైసీపీ అధికారికంలోకి వచ్చిన తర్వాత టెన్త్‌ ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jun 2022 11:32 AM (IST)

    వాయిదా పడ్డ ఫలితాలు..

    ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఫలితాలను వాయదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. పరీక్షా ఫలితాలను సోమవారం (జూన్‌6) రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

  • 04 Jun 2022 11:31 AM (IST)

    ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

    * ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలోకి వెళ్లాలి.
    * అనంతరం AP SSC result 2022 లింక్‌పై క్లిక్‌ చేయండి.
    * తర్వాత పుట్టిన తేదీ, రోల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి
    * వెంటనే ఫలితాలు వచ్చేస్తాయి.

  • 04 Jun 2022 11:23 AM (IST)

    ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

    * ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలోకి వెళ్లాలి.
    * అనంతరం AP SSC result 2022 లింక్‌పై క్లిక్‌ చేయండి.
    * తర్వాత పుట్టిన తేదీ, రోల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి
    * వెంటనే ఫలితాలు వచ్చేస్తాయి.

  • 04 Jun 2022 11:13 AM (IST)

    ఆలస్యం కానున్న టెన్త్‌ ఫలితాలు..

    ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షా ఫలితాలు చెప్పిన సమయం కంటే కాస్త ఆలస్యం కానుంది. ఉదయం 11 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయని ప్రకటించినా అధికారులు ఇంకా ప్రెస్‌ మీట్‌కు హాజరుకాలేదు. దీంతో ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యం కానుంది.

  • 04 Jun 2022 10:57 AM (IST)

    ర్యాంకులకు బదులు మార్కులు ఎందుకంటే..

    గతంలో పదో పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని పాఠశాల విద్యాశాఖ నిషేధించింది. ఇందులో భాగంగా 83వ నంబరు జీవో జారీచేశారు. విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

  • 04 Jun 2022 10:50 AM (IST)

    వైసీపీ అధికారికంలోకి వచ్చాక ఇదే తొలిసారి..

    వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గనార్హం. గడిచిన రెండేళ్లలో (2020, 2021) కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులు నేరుగా ఇంటర్‌కు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

  • 04 Jun 2022 10:39 AM (IST)

    ఫలితాలపై కీలక ఆంక్షలు..

    టెన్త్‌ ఎగ్జామ్స్‌ ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆంక్షలు విధించింది. ర్యాంకులకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు విద్యాసంస్థలు ఇవ్వొద్దని సూచించింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష తప్పదని కూడా హెచ్చరించింది. 3-7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Follow us on