
అమరావతి, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్, టీవీ9 తెలుగు వెబ్‌సైట్, మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మొత్తంగా టెన్త్‌లో 85 శాతం ఉత్తీర్ణత వచ్చింది. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా ఒకే ఒక్క క్లిక్‌తో మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు.‘LEAP’ మొబైల్ యాప్ ద్వారా, డీజీలాకర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి. సరాసరిన 99.05 శాతం మంది పరీక్షలకు హాజరైనారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
🚨 SSC Public Examinations, March 2026 Results are now live 🚨
Students can access their results through:
• Official Portal: https://t.co/jyZPaxr5Q9
• Mana Mitra (WhatsApp Governance): Send “Hi” to 9552300009
• LEAP Mobile Application
• DigiLocker
Results are also available…— Lokesh Nara (@naralokesh) April 30, 2026