AP Polycet 2026 Registrations: ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి తాజాగా విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3, 2026 నుంచి ప్రారంభమవుతుంది..

AP Polycet 2026 Registrations: ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
AP Polycet Notification

Updated on: Mar 03, 2026 | 4:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి తాజాగా విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3, 2026 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌ 2026 ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ వంటి డిప్లొమా కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2026 మార్చిలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఎలాంటి ఆలస్య రుసులు లేకుండా ఏప్రిల్ 4, 2026వ తేదీ వరక దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పాలీ సెట్‌ పరీక్ష ఏప్రిల్ 25, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మార్చి 3, 2026.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026.
  • పాలీసెట్‌ పరీక్ష నిర్వహణ తేదీ: ఏప్రిల్ 25, 2026.

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us