నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 411ఎస్‌ఐ, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు జనవరి 22వ తేదీన కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించనుంది.
అయితే ఈ పోస్టుల్లో సివిల్ ఎస్సైలు 315, ఆర్‌ఎస్సైలు 96, సివిల్ కానిస్టేబుళ్లు 3580, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు 2560 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్ ఇన్‌స్పెక్టర్లకు వచ్చే నెల 14 నుంచి, కానిస్టేబుళ్లకు ఈనెలాఖరు నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్లు ఉండనున్నారు.
కాగా, యేటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖను ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి
మరిన్ని కెరీర్ & ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి