AP Police Constable Exam Date 2025: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా..

AP Police Constable Exam Date 2025: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Police Constable Exam Date

Updated on: May 25, 2025 | 7:45 AM

అమరావతి, మే 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్‌ 1న నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి తాజాగా వెల్లడించింది.

జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించినమే హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

రేపు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక కీ విడుదల.. తుది కీ ఎప్పుడంటే?

దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ మే 26 (సోమవారం) విడుదల కానుంది. ఈ పరీక్ష మే 18న నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఐటీ కాన్పూర్‌.. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 2న తుది కీతోపాటు ఫలితాలు విడుదల చేయనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.