Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Hall Tickets 2025: నేడే ఇంటర్మీడియట్ హాల్‌ టికెట్లు విడుదల.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డులు కీలక ఆదేశాలు జారీ చేశాయి. పేపర్‌ లీకేజీలకు తావులేకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తుంది..

Inter Hall Tickets 2025: నేడే ఇంటర్మీడియట్ హాల్‌ టికెట్లు విడుదల.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ!
Inter Hall Tickets 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 20, 2025 | 7:00 AM

అమరావతి, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక జనరల్‌ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్‌ పరీక్షలు నేటితో (ఫిబ్రవరి 20వ తేదీతో) ముగుస్తాయి. ఈ ఏడాదికి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

మొత్తం విద్యార్ధుల్లో మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో జనరల్‌ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్‌టికెట్లు పంపిణీకి ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు గతేడాది మాదిరిగానే క్యూఆర్‌ కోడ్‌ విధానం అనుసరిస్తారు. దీని ద్వారా ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది విషయం సెంటర్‌తో సహా సమస్త వివరాలు వెంటనే తెలిసిపోతాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్‌ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది.

ఇవి కూడా చదవండి

మార్చి 5 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు.. అధికారులకు బోర్డు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో చకచకా ఏర్పాట్లు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కార్యాలయంలో ఫిబ్రవరి 18న అన్ని జిల్లాల డీఐఈఓలు, నోడల్‌ అధికారులతో బోర్డు కార్యదర్శి ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పకడ్భందీగా నిఘా ఉంచేలా జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించాలని ఆదేశించారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు త్వరలోనే జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.