AP Inter 1st Year Supply Results 2024: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

|

Jun 26, 2024 | 4:11 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26 (బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో మంత్రి లోకేష్ విడుదల చేశారు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు...

AP Inter 1st Year Supply Results 2024: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
AP Inter 1st Year Supply Results
Follow us on

అమరావతి, జూన్‌ 26: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26 (బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో మంత్రి లోకేష్ విడుదల చేశారు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలను జూన్‌ 18న విడుదల చేశారు. మొత్తం 1,27,190 మంది (జనరల్‌, ఒకేషనల్‌ కలిపి) ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 74,868 మంది అంటే 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. జనరల్‌ కేటగిరీలో 59 శాతం, ఒకేషనల్‌లో 57 శాతం మంది చొప్పున పాసయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్ కోసం జూన్‌ 20 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

నేటి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల సందర్భంగా ప్రథమ సంవత్సరం విద్యార్ధులు కూడా సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. రీ-వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.