AP Group 1 Results: విడుదలైన ఏపీ 2018 గ్రూప్‌-1 ఫలితాలు.. కోర్టు తీర్పుకు లోబడే ఫలితాల వర్తింపు..

|

Jul 05, 2022 | 7:28 PM

AP Group 1 Results: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. 2018లో నిర్వహించిన పరీక్షలకు అన్ని రకాల...

AP Group 1 Results: విడుదలైన ఏపీ 2018 గ్రూప్‌-1 ఫలితాలు.. కోర్టు తీర్పుకు లోబడే ఫలితాల వర్తింపు..
Follow us on

AP Group 1 Results: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. 2018లో నిర్వహించిన పరీక్షలకు అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసుకొని ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన విద్యార్థుల వివరాలను ఎపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం ప్రకటించారు. ఫలితాలను ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మొత్తం 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఆ సమయంలో ఏకంగా లక్షన్నరకుపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 325 మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా తాజాగా ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. కోర్టు తీర్పుకు లోబడే ఈ ఫలితాలు వర్తిస్తాయని సవాంగ్‌ తెలిపారు. ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని ఆయన వివరించారు.

అయితే వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని సవాంగ్‌ వివరించారు. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్‌ 1లో నిలిచారని వెల్లడించారు. టాప్‌ 2లో వైఎస్సార్‌జిల్లా కోతుల గుట్టపల్లికి చెందిన కె.శ్రీనివాసరాజు, టాప్‌ 3లో హైదరాబాద్‌కు చెందిన సంజన సింహ ఉన్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలనో  గ్రూప్ 2 నోటిఫికషన్లు జారీ చేస్తామని సవాంగ్ తెలిపారు.

ఈ నెల 24న దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నామని తెలిపిన ఎపీపీఎస్సీ ఛైర్మన్ ఈ నెల 31 న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. డిజిటల్ వాల్యువేషన్ పై న్యాయస్థానం లోనూ విచారణ జరిగిందని తెలిపిన సవాంగ్ టెక్నాలజీ వినియోగంతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..