Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. ప్రకటన విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలివే..

|

Dec 03, 2022 | 5:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన..

Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. ప్రకటన విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలివే..
AP Government
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్ 9వ తేదీలోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వచ్చిన దరఖాస్తుల్లో ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను 19వ తేదీన ప్రకటిస్తారు. ఆ తర్వాత డిసెంబర్క 20వ తేదీన సెలక్షన్‌ లిస్ట్‌ను తీసి.. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వనున్నారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పూర్తి చేసిన దరఖాస్తులను క్రింద తెలిపిన రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల వివరాలు

విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం

రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి

ఇవి కూడా చదవండి

గుంటూరు రీజనల్ డైరెక్టర్ కార్యాలయం : పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు

వైఎస్సార్ కడప రీజనల్ డైరెక్టర్ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..