ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థన మరింత పిటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ సర్కార్ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టాల మాదిరిగానే సచివాలయ వ్యవస్థ కూడా ప్రత్యేక చట్టరూపం దాల్చబోతోంది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్ల ప్రకారం చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు చట్టసభ్యులు ఆమోదం తెలిపితే, ఇది చట్ట రూపం దాల్చుతుంది. గ్రామ, వార్డు సచివాలయ చట్టం అమల్లోకొస్తుంది. క్యాబినెట్ నుంచి దీనిపై ఈ రోజు కీలక ప్రకటన కూడా రానుంది.
కాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో గ్రామ, సచివాలయ వ్యవస్థను 2 అక్టోబర్ 2019న ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15, 004 సచివాలయాలు ఉన్నాయి. ఇక కేవలం నాలుగు నెలల వ్యవధిలో దాదాపు 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ప్రతి సచివాలయంలో 10 -11 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటి ద్వారా వీటి ద్వారా దాదాపు 545 రకాల సర్వీసులను ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే పొందుతున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.