Jobs In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలో పలు ఖాళీల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేశారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..
* మొత్తం 3393 పోస్టులకు గాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 633, ఈస్ట్ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణాలో 1003, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 786, చిత్తూరు,కడప, అనంతపూర్, కర్నూలులో 971 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 06.11.2021ను చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Yoga Poses: ఈ 3 యోగాసనాలు మీలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి.. పూర్తి వివరాలు మీకోసం..