AP EAPCET 2025 Result Date: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ఆన్సర్‌ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతోపాటు మాస్టర్‌ ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్స్‌లను కూడా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీపై మే 30వ తేదీ వరకు అభ్యంతరాలకు స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్‌ కీ రూపొందిస్తారు. అనంతరం..

AP EAPCET 2025 Result Date: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
Andhra Pradesh EAPCET

Updated on: May 30, 2025 | 11:01 AM

అమరావతి, మే 30: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ఆన్సర్‌ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతోపాటు మాస్టర్‌ ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్స్‌లను కూడా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీపై మే 30వ తేదీ వరకు అభ్యంతరాలకు స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్‌ కీ రూపొందిస్తారు. అనంతరం ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఈ ఏడాది జేఎన్‌టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీసెట్‌-2025 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగగా.. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. ఇప్పటికే దీనికి అభ్యంతరాల గడువు ముగిసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ చెప్పారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,80,611 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లు కలిపి 2,80,611 మందికిగానూ 2,64,840 (94.38 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి అన్ని సెషన్లు కలిపి 81,837 మంది హాజరుకావాల్సి ఉండగా వీరిలో 75,460 (92.21 శాతం) మంది పరీక్షలు రాశారు. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు జూన్‌ 14వ తేదీన విడుదలవుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.