AP 10th Supplimentary Exams 2025: మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

AP 10th Supplimentary Exams 2025: మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
10th Class Supplementary Hall Tickets

Updated on: May 13, 2025 | 6:24 AM

అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్‌ టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ 95523 00009 నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్‌ మాస్టర్ నుంచి కూడా హాల్‌ టికెట్లు పొందొచ్చు. రెగ్యులర్‌ విద్యార్ధులతోపాటు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి వీటిని పొందొచ్చు. ఇక పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఆయా రోజుల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జరిగిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్‌ ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల 2025 పూర్తి టైం టేబుల్ ఇదే..

  • మే 19వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మే 20వ తేదీన సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మే 21వ తేదీన ఇంగ్లీష్
  • మే 22వ తేదీన గణితం
  • మే 23వ తేదీన భౌతిక శాస్త్రం
  • మే 24వ తేదీన జీవ శాస్త్రం
  • మే 26వ తేదీన సామాజిక అధ్యయనాలు
  • మే 27వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ I
  • మే 28వ తేదీన OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషనల్‌ కోర్సు

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.