American Corner: అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌

|

Sep 23, 2021 | 11:49 AM

సాగర నగరం విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో అమెరికన్‌ కార్నర్‌ను వర్చువల్‌ విధానంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ప్రారంభించారు.

American Corner:  అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌
America Corner
Follow us on

American Corner – Visakhapatnam – Andhra University: సాగర నగరం విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో అమెరికన్‌ కార్నర్‌ను వర్చువల్‌ విధానంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ప్రారంభించారు. దీంతో దేశంలో విశాఖపట్నం మూడో అమెరికన్‌ కార్నర్‌ అయింది. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికన్‌ కార్నర్‌ ద్వారా పలు అంశాలపై సమగ్ర అవగాహన పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ రీజియన్‌ అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌ మాన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తర్వాత విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభమైందని తెలిపారు.

అమెరిన్‌ కాన్సులేట్‌ సహకారంతో విశాఖలో ఈ ‘అమెరికన్‌ కార్నర్‌’ ఏర్పాటు చేశారు. యూఎస్‌ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి ఈ కార్నర్ సేవలు అందించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్ తోపాటు, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

Read also: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో గుబులు రేపుతోన్న కొత్త ఎండీ బాజిరెడ్డి కామెంట్లు.!