All India Radio Recruitment 2022: మీడియా సంస్థలో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే లక్కీ ఛాన్స్. చెన్నైలోని ప్రసార్ భారతికి చెందిన ఆల్ ఇండియా రేడియో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా న్యూస్ ఎడిటర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూజీ/ పీజీ, జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా న్యూస్ డెస్క్ నిర్వహణ, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్ చేయడంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 55 ఏళ్లు లోపు ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైణ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను రీజినల్ న్యూస్ యూనిట్ హెడ్, ఆల్ ఇండియా రేడియో, నం. 4 కామరాజర్ శాలై, మైలాపూర్, చెన్నై అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..