Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దిగ్గజ ఏవియేషన్ సంస్థలో 5వేల ఉద్యోగాలు..
ప్రముఖ అంతర్జాతీయ విమానాయ రంగ సంస్థ ఎయిర్ బస్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశంలో రానున్న రెండేళ్లలో 5వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. రెండేళ్లలో 2 బిలియన్ల విలువైన పెట్టుబడులు పెట్టనున్నారని, దీంతో భారీగా ఉద్యోగ కల్పన జరగనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు...
ప్రపంచ దిగ్గజ ఏవియేషన్ సంస్థ ఎయిర్‌బస్ యవతకు శుభవార్త తెలిపింది. భారతదేశంలో 5000 మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న రెండేళ్లలో 2 బిలియన్ల విలువైన సేవలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ భారత్‌లో ఎయిర్ బస్ సేవలు మెగుపడనున్నాయని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ఎయిర్ వేస్ కంపెనీ భారతదేశంలో దాదాపు 3,500 మంది వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. అలాగే దేశం నుంచి 1 బిలియన్ యూరోల విలువైన సేవలను అందిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఎయిర్‌బస్ ఇండియా, సౌత్ ఏషియా హెడ్‌క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మెయిలార్డ్ మాట్లాడుతూ.. ఎయిర్ బస్ సేవలు సేవలు మరింత విస్తృతం కానున్నాయని, వచ్చే రెండేళ్లలో ఇది 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
అలాగే వచ్చే రెండేళ్లలో భారత్‌లో ఎయిర్‌బస్ ప్రత్యక్ష ఉపాధి సంఖ్య 5 వేలు దాటుటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎయిర్‌బస్, ఎయిర్ ఇండియాతో జాయింట్ వెంచర్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే దేశంలో రెండవ పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరులో 5000 సీట్ల ఎయిర్ బస్ క్యాంప్‌ను అభివృద్ధి చేయనున్నారు. అలాగే యూరోపియన్ మేజర్ C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు.. H125 హెలికాప్టర్‌లను భారతదేశంలో తయారు చేయనున్నారు. ఇవి రెండు టాటా గ్రూప్ భాగస్వామ్యంతో నడవనున్నాయి.
మేడ్ ఇన్ ఇండియా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సంస్థ అభివృద్ధికి మద్ధతుగా ఎయిర్‌బస్ భారతీయ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తోందని మెయిలార్డ్ తెలిపారు. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సీఈఓ మైఖేల్ స్కోల్‌హార్న్ మాట్లాడుతూ ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదం సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. C295 ప్రోగ్రామ్ భారతదేశంలో ప్రైవేట్ రంగం ద్వారా పూర్తిగా తయారు చేయబడిన మొదటి విమానంగా చరిత్ర సృష్టిస్తోందని ఆయన అన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..